ఎల్బీ నగర్ (జనం సాక్షి ) 9 అక్టోబర్ మహర్షి వాల్మికీ జయంతి దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో జరుపుకుంటున్నారు. అందులో భాగంగా ఆటోనగర్ వాసులు వాల్మికీ జయంతిని ఘనంగా నిర్వహించారు .మాజీ డివిజన్ అధ్యక్షులు టంగుటూరి నాగరాజు గౌరవ అతిథిగాపాల్గొని వాల్మీకి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షులు టంగుటూరి నాగరాజు మాట్లాడుతూ డివిజన్ ప్రజలందరికి మరియు రాష్ట్ర ప్రజలందరికీ వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అధర్మం నుంచి ధర్మం వైపు, అసత్యం నుంచి సత్యసంధత వైపు సమాజాన్ని నడిపించాలన్నదే వాల్మీకి ఆశయం అని అన్నారు .ఉన్నతమైన ఆదర్శాలను, మానవతా విలువలను రామాయణం అడుగడుగునా మనకు బోధిస్తుందని, వాల్మీకి సంస్కృతంలో మొట్టమొదట గొప్ప కావ్యాన్ని మనకు అందించారని రామాయణాన్ని మధురకావ్యంగా మలిచి మానవజాతికి సన్మార్గాన్ని నిర్దేశించిన మహనీయుడు, ఆదికవి వాల్మీకి మహర్షిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సమాజ ఉద్ధరణకు ఎలాంటి సాహిత్యం కావాలో, అలాంటి సాహిత్యాన్ని ఉత్తమమైన రీతిలో విశ్వమానవునికి సన్మార్గాన్ని చూపిన మహనీయుడు వాల్మీకి మహర్షి అని అన్నారు. వాల్మీకి రామాయణాన్ని అనుసరించి, ప్రతి ఒక్కరిలో మార్పు రావాలని, గొప్పగా ఎదగాలని, ధర్మమార్గాన్ని, వాల్మీకి బోధనను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని వివరించారు.
అందుకే మానవుడి జీవితాన్ని సుఖమయం, ఆదర్శవంతం చేసే రాజకీయ ధర్మాలను ఎన్నింటినో రామాయణంలో పొందుపరిచారు వాల్మీకి. మానవతా విలువలను, ఉన్నతమైన ఆదర్శాలను బోధించే రామాయణ మహా కావ్యాన్ని లిఖించి అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి సందర్బంగా ఆదివ్య పురుషున్ని స్మరించుకుందాం. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, కమిటీ మెంబర్లు కే. ఆంజనేయులు, పి. రాజు.గోవింద్ ఉషాన్న రాము శివశంకర్ వెంకటయ్య కృష్ణ నాగరాజు బలరాం సూర్యనారాయణ వేణు రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.




