సార్ నమస్కారములు.మనసు మీద రాసిన ఈ కవిత పరిశీలించ ప్రార్థన.
మనసు పదిలం
కట్టుబాట్లు లేనిది
తిన్ననైనది కానిది,
చెప్పినమాట విననిది
ఉన్నచోట ఉండనిది,
అదుపాజ్ఞలలో పెట్టలేనిది
జీవన రథాన్ని నడిపే మనసు.
అదొక లోతు తెలియని అగాధం.
మస్తిష్కం చేసే యోచనలన్నీ
మనసులోని భావనలే…
అదే బరువెక్కిపోతే
మస్తిష్కమంతా శూన్యమే.
అసంతృప్తితో నిండిన మనసుకు
అన్నీ చింతలే,
తృప్తితో నిండితే
ఆ మనసొక పాలపుంతే.
అందుకే…
స్వార్థపు ముళ్లను తొలగించి
మనసు చెట్టును ఎండనీయక,
అనురాగ పుష్పాలమై
పరిమళాలను వెదజల్లుతూ,
మానవత్వ రూపాలై
జనుల మనసులు పులకించేట్టు
ప్రశాంత పల్లవులను పలికిస్తూ,
మనసున్న మానవులమని
నిరూపించుకుందాం…
చరితన
చిరంజీవులుగా నిలిచిపోదాం…
హామీపత్రం
“మనసు పదిలం” అను ఈ కవిత పూర్తిగా నా స్వంతం.దేనికీ అనువాదం కాదు.అనుకరణ కాదు.ఎక్కడా ప్రచురింపబడలేదు. సోషల్ మీడియాలో పెట్టిఉండలేదు. ఈ కవితకి సంబంధించిన పూర్తి బాధ్యత నాదే.
వేమూరి శ్రీనివాస్
9912128967
తాడేపల్లిగూడెం