సింగాయిపల్లి గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉట్టి కొట్టే కార్యక్రమం

కోడేరు (జనం సాక్షి) ఆగస్టు 21 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలోని సింగాయి పల్లి గ్రామంలో శ్రీకృష్ణ  జన్మాష్టమి సందర్భంగా గ్రామ ప్రజలు ఘనంగా ఉట్టికొట్టే కార్యక్రమం సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మా గ్రామ ప్రజలు మా గ్రామం సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని కోరుకున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గ్రామంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామస్తులు మరియు వాహనదారులు ఈ అన్నదాన కార్యక్రమంలో యువకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు..