Tuesday, 3 November 2026

సిందోల్ లో ఎండు గంజాయి  పట్టివెత

రేగోడు( జనంసాక్షి )ఏప్రిల్  24. మండల పరిధిలోని సిందొోలు గ్రామంలో సోమవారం రాత్రి సంగారెడ్డి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐలు  రమేష్ రెడ్డి  మోహన్ కుమార్ ల ఆధ్వర్యంలో డిప్టీ కమిషనర్ కెబి శాస్త్రి ఆదేశానుసారం మండలంలోని సిందోల్ గ్రామానికి చెందిన ఇందూరు సంగయ్య అనే వ్యక్తి వ్యవసాయ భూమిలో సర్వే నంబర్ 91/ఆ గల వ్యవసాయ భూమిలో పన్నెండు కిలోల ఎండు గంజాయి 2 ,220 మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇందూరు సంగయ్య ను మెదక్ కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు చంద్రశేఖర్.హెడ్ కానిస్టేబుల్  సురేష్ జయశ్రీ శ్రీమణి పాల్గొన్నారు.