సిఎంఆర్ బియ్యం సత్వరమే అందించాలి

జాప్యం చేసే మిల్లులపై చర్యలు తప్పవు
అదనపు కలెక్టర్ ఎస్.మోహన్ రావు
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):జిల్లాలో ఖరీఫ్ 2021-22 సంవత్సరానికి సంబంధించి సిఎంఆర్ బియ్యాన్ని సత్వరమే అందించాలని మిల్లుల యాజమాన్యాలను అదనపు కలెక్టర్ ఎస్.మోహన్ రావు ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లాలోని మిల్లుల యాజమానులతో ఖరీఫ్  2021-22 ధాన్యంకి సంబంధించి సిఎంఆర్ బకాయి  బియ్యంపై సంబంధిత శాఖ అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ 2021-22 సిఎంఆర్. బియ్యం  లక్షా 42 వేల మెట్రిక్ టన్నులు బకాయి ఉందని తెలిపారు.ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి సిఎంఆర్ రైస్ అప్పగించుటకై పలు మార్లు సమావేశాలు నిర్వహించడం జరిగిందన్నారు.అయినా సిఎంఆర్ రైస్ అందించుటలో జాప్యం చేస్తున్నారని తెలిపారు.జిల్లాలో ఉన్నటువంటి బకాయి మిల్లుల సామర్థ్యం ప్రకారంగా రోజు వారీగా మిల్లింగ్ చేసి ఎఫ్సిఐకి అప్పగించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, అలా అప్పగించని మిల్లులపై సత్వర చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.అనంతరం జిల్లా మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సూచనలకు అనుగుణంగా, ప్రభుత్వ మార్గదర్శకాలు లోబడి జిల్లాలో 2021-22ఖరీఫ్ సీజన్ సిఎంఆర్ రైస్ ను త్వరితగతిన అందించేందుకు గట్టి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో డిఏస్ఓ విజయ లక్ష్మి , డియం రాంపతి , జిల్లా మిల్లర్స్ అధ్యక్షులు రవీంద్ర, డిటిలు నాగలక్షి , రాజశేఖర్ , రామిరెడ్డి, విజయ శేఖర్,మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు