సిఎస్ఆర్ నిధుల పర్యవేక్షణ పకడ్బందీగా జరగాలి.
సంగారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 22:(జనం సాక్షి):
జిల్లాలోని పరిశ్రమలు
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సి.ఎస్.ఆర్.నిధులు అందజేసి జిల్లా అభివృద్ధికి సహకరించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ ( సి ఎస్ ఆర్ నిధుల పర్యవేక్షణ కమిటీ) సంబంధిత అధికారులకు సూచించారు.
శనివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో
సి ఎస్ ఆర్ నిధుల పర్యవేక్షణా కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పరిశ్రమలను 5 క్లస్టర్స్ గా చేసామన్నారు. యాజమాన్యాలు కంపెనీస్ యాక్ట్ మేరకు సామాజిక బాధ్యతగా జిల్లా అభివృద్ధికి సిఎస్ఆర్ కింద వివిధ అభివృద్ధి పనులకు నిధులను కలెక్టర్ ఖాతాలో జమ చేయాలన్నారు.
సి.ఎస్.ఆర్. నిధులను రాబట్టడానికి
సరైన పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన కమిటీ వారి వారికి కేటాయించిన క్లస్టర్ లోని పరిశ్రమలను పరిశీలించి నివేదిక అంద చేయాలని సూచించారు. కంపెనీ యాక్ట్ నిబంధన మేరకు ఉన్నది లేనిది క్షుణ్ణంగా పరిశీలించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న కంపెనీలకు నోటీసులు జారీ చేయాలన్నారు.
ఆయా అధికారుల బృందం తమకు కేటాయించిన ఆయా క్లస్టర్లలో ఉన్న అన్ని పరిశ్రమలను మరో మారు తనిఖీ చేసి పూర్తి వివరాలతో నివేదికను ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమీక్షలో అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, కమిటీలోని ఆయా శాఖల అధికారులు,
తదితరులు పాల్గొన్నారు.
Attachments area