సిఐటియు గ్రామపంచాయతీ కార్మికుల ఆధ్వర్యంలో జడ్పీ సీఈవో గౌతంరెడ్డికి వినతి పత్రం అందజేత
బోయిన్ పల్లి ఆగస్టు 01 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయం ముందు చేపట్టిన గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె 27 రోజుకు చేరుకుంది. మంగళవారం రోజున మండల పరిషత్ కార్యాలయానికి జడ్పీ సీఈవో గౌతంరెడ్డి వచ్చిన సందర్భంగా సిఐటియు గ్రామపంచాయతీ కార్మికుల ఆధ్వర్యంలో జెడ్పి సీఈఓ కు వినతి పత్రాన్ని అందజేశారు.