సికింద్రాబాద్ (జనం సాక్షి ): సితాఫలమండీ లోని సికింద్రాబాద్ ఎం ఎల్ ఏ క్యాంపు కార్యాలయం వద్ద మైనారిటీ నాయకుడు అబ్దుల్లా తో కలిసి ఉప సభాపతి పద్మారావు గౌడ్ శనివారం ఉదయం జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. సామూహికంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమం లో కార్పొరేటర్లు సామల హేమ, రాసురి సునిత, కంది శైలజ, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, తెరాస యువ నేత తీగుల్ల రామేశ్వర్ గౌడ్, నాయకులు లింగాని శ్రీనివాస్, కరాటే రాజు తదితరులు పాల్గొన్నారు.
సికింద్రాబాద్ ఎం ఎల్ ఏ క్యాంపు కార్యాలయం లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన పద్మారావు గౌడ్




