సిపిఎం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి

వీపనగండ్ల సెప్టెంబర్ 10 (జనంసాక్షి) సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని బస్టాండ్ దగ్గర రైతుల సమక్షంలో వర్ధంతి సభను నిర్వహించడం జరిగింది. ఈ సభలో సిపిఎం మండల కార్యదర్శి డి బాల్ రెడ్డి మాట్లాడుతూ భూమికోసం బుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన నిప్పుకనిక చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు మురళి, మండల నాయకులు ఈశ్వర్, ఆశన్న, రాములు, రాములు గౌడ్, వెంకటేష్, నాగేష్, ప్రవీణ్, రామకృష్ణ, రజక సంఘం నాయకులు గోపి, వీరబాబు, రైతులు నక్క భగవంతు, కృష్ణయ్య, బాలకృష్ణ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.