సిపిఎస్ ను వెంటనే రద్దు చేయాలి

–  పిఆర్టీయు మండలశాఖద్యక్షుడు శంకర్
ఫొటో ఉంది
హత్నూర (జనం సాక్షి)
ఉపాధ్యాయులకు నష్టం కలిగే విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని పిఆర్టీయు మండలశాఖద్యక్షుడు శంకర్ డిమాండ్ చేశారు.పెన్షన్ విద్రోహ దినాన్ని పురస్కరించుకుని గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా తహసీల్దార్ పద్మావతికి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.కార్యక్రమంలో సంఘం మండల ప్రధాన కార్యదర్శి ఎ.నరేంద్ర, ఉమారాణి,మల్లయ్య తదితరులు ఉన్నారు.