Thursday, 5 November 2026

సిపిఐ 24వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు కే సారయ్య

టేకులపల్లి, సెప్టెంబర్ 28( జనం సాక్షి ): అక్టోబర్ 14 నుంచి 18 వరకు విజయవాడలో జరిగే సిపిఐ 24వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కే సారయ్య కోరారు. టేకులపల్లి స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన మండల కౌన్సిల్ సమావేశానికి రాష్ట్ర సమితి సభ్యులు కే సారయ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలు పెరగని ప్రజా పోరాటాలకు పురిటి గడ్డ భారత కమ్యూనిస్టు పార్టీయే అని అన్నారు. అక్టోబర్ 14 నుంచి 18 వరకు విజయవాడ పట్టణములో జరిగే సిపిఐ పార్టీ జాతీయ 24వ మహాసభలకు భారతదేశంలోని నాలుమూలల నుండి ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులు పార్టీ ప్రతినిధులు పాల్గొంటారని ఆయన తెలిపారు. పార్టీ సానుభూతిపరులు ,మేధావులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జాతీయ మహాసభలను జయప్రదం చేయవలసిందిగా ఆయన పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యులు, గూగులోతు రామచందర్, మండల నాయకులు ఏజ్ భాస్కర్ ,గుగులోతు శ్రీను, వాసం భద్రయ్య, అయిత శ్రీరాములు ,బానోత్ వీరన్న, బండి వీరభద్రం ,మధు, సతీష్ ,నరేష్, లక్ష్మణ్ ,కన్నయ్య ,రాజు ,మోతి ,సోనీ, విజయలక్ష్మి , భారతి ,అరుణ తదితరులు పాల్గొన్నారు.