Wednesday, 4 November 2026

సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి:ఎంపీపీ

మేళ్లచెరువు మండలం (జనం సాక్షి న్యూస్)

మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య కేంద్రంలో పని చేసే సిబ్బంది ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఎంపీపీ కొట్టే పద్మా సైదేశ్వరరావు అన్నారు. గురువారం ఆమె అధ్యక్షతన పీహెచ్సీలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
వైద్య సిబ్బంది అందరూ సమయ పాలన పాటించి రోగులకు, ప్రజలకు సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. గ్రామాలలో పనిచేస్తున్న ఏఎన్ఎం లు, ఆశా వర్కర్లు  ప్రజలకు, రోగులకు, ముఖ్యంగా గర్భిణీలకు, బాలింతలకు అందుబాటులో ఉండాలని అదేశించారు.మరో నెల తరవాత పీహెచ్సి లో జరిగే సమావేశంలో అందరు కూడా తగిన ప్రతిభ కనపర్చాలని సూచించారు.
ఈ సమావేశంలో  డాక్టర్  ప్రేమ్ సింగ్,సీహెచ్ ఓ కృష్ణయ్య,యుడిసీ సునీల్ , వైద్య సిబ్బంది ఏఎన్ఎం లు తదితరులు పాల్గొన్నారు

Attachments area