సిరిపూర్ లో ముగ్గుల పోటీలు.

మల్లాపూర్ (జనంసాక్షి) ఆగస్టు:20 మండలంలోని సిరిపూర్ గ్రామంలోఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 75వ భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు గ్రామ పంచాయతీ ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గౌరవ శ్రీ భూక్యా గోవింద్ నాయక్ గారి ఆధ్వర్యంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజా శ్రీనివాస్ గారి పర్యవేక్షణ లో ఐకేపీ లీడర్లు మహిళా గ్రామ ప్రజలు పాల్గొన్నారు మరియు ముగ్గుల పోటీ అనంతరం గెలిచినా వారికీ బహుమతి ప్రధానం చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో పంచాయతీ కార్యదర్శి రంజిత్ కుమార్, ఎంపీటీసీ ఏనుగు రామ్ రెడ్డి voa,s మమత, లక్ష్మి, ఆశ కార్యకర్త సరిత, ఫిల్డ్ అసిస్టెంట్ మమత, తదితరులు పాల్గొన్నారు