అల్వాల్ (జనంసాక్షి) ఆగస్టు 30
అల్వాల్ సర్కిల్ వెంకటాపురం డివిజన్ భూదేవి నగర్ కాలనీలో 25 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను మల్కాజ్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు సిసి రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ ఎగ్జిక్యూటివ్ అధికారులు సోమవారం ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీ వాసులకు ఇబ్బంది కలగకుండా నాణ్యత ప్రమాణాలతో పనులను త్వరగా పూర్తి చేయాలని కార్పొరేటర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కారం చూపుతామని. డివిజన్ పరిధిలో మంజూరైన అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేసేలా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ రాజు, డిఈ ప్రశాంతి, ఏఈ అరుణ్, వర్క్ ఇన్స్పెక్టర్ నవీన్, టిఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకులు అనంతుల సంతోష్, భాస్కర్, లక్ష్మారెడ్డి, సునీల్, రమణారెడ్డి, బిఎన్ రమేష్, మల్లేష్, అనిల్, శ్యామ్ సుందర్, జమందర్, షేక్, షబ్బీర్, పెంటన్న, రాజు, విజయ్ శేఖర్, ప్రభాకర్, రామకృష్ణ, మల్లేష్ యాదవ్, సుబ్రహ్మణ్యం, లక్ష్మి, ఉదయ, స్వప్న, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.




