Wednesday, 4 November 2026

సిసి రోడ్డు పనులను ప్రారంభించిన కార్పొరేటర్.

మల్కాజిగిరి.జనంసాక్షి.ఆగస్టు26
వినాయక నగర్ డివిజన్ లోని అన్ని కాలనీలలో మౌళిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నానని డివిజన్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి అన్నారు.శివగౌరీ ఎంక్లేవ్ లో 23 లక్షల వ్యయంతో సిసి రోడ్డు పనులను ప్రారంభించారు.
అనంతరం కాలనీలో పర్యటిస్తూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈకార్యక్రమంలో ప్రతాప్ రెడ్డి, మద్దిలేటి,కనకయ్య,మల్ రెడ్డి,రమేష్, ప్రకాష్,విజయ,భాస్కర్,ఓంప్రకాష్, శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.