అల్వాల్ (జనంసాక్షి) అక్టోబర్ 18
అల్వాల్ డివిజన్ కొరకు ఆహరిస్నాషలు కృషి చేస్తానని స్థానిక కార్పొరేటర్ చింతల విజయశాంతి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపల్ అధికారులతో కలిసి అల్వాల్ సర్కిల్ అల్వాల్ డివిజన్ సాయి నగర్ కాలనీ లోని 6లక్షల రూపాయలతో జరుగుతున్న సిసి రోడ్డుపనులనుఆమెపరిశీలించడంజరి గింది.ఈసందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సిసి రోడ్డు పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ప్రజలకుఇబ్బందులుకాకుండాపనులను త్వరగాపూర్తిచేయాలనిఅధికారులకు కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కారం చూపుతామని డివిజన్ పరిధిలో మంజూరైన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఈఈ రాజు, డిఈ ప్రశాంతి, వర్క్ ఇన్స్పెక్టర్ రామారావు, స్థానిక నాయకులు బబిత, కవిత, అరవింద్, అశ్విని, పట్టాభి, సాయి నగర్ కాలనీ అధ్యక్షులు సంతోష్, విధానందు, మధుమతి, తదితరులు పాల్గొన్నారు.




