కల్లుగీత కార్మిక సంఘం మహాసభను విజయవంతం చేయాలి
జిల్లా కార్యదర్శి వంగ వేణు గౌడ్
స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 18 , ( జనం సాక్షి ) :
అక్టోబర్ 19 న యాదగిరిగుట్టలో జరిగే తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర 3 వ మహాసభను విజయవంతం చేయాలని కల్లుగీతకార్మిక సంఘం జిల్లాకార్యదర్శి వంగ వేణు గౌడ్ పిలుపునిచ్చారు. డివిజన్ కేంద్రంలో వేణు గౌడ్ మాట్లాడుతూ తెలం గాణ రాష్ట్ర ప్రభుత్వం కల్లు గీత కార్మికులకు రాష్ట్ర బడ్జెట్లో 5వేల కోట్ల రూపాయలు కేటాయించి 560 జీఓ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రతీ కల్లు గీత సొసైటీకి 5 ఏకరాల భూమి ని కేటాయించి అందులో తాటి, ఈత,ఖర్జూరలతో పాటుగా గిరక తాటి మొక్కలు నాటి వాటి సంరక్ష ణ బాధ్యతలను ప్రభుత్వమే తీసుకొని ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహించాలని అన్నారు. గీతన్న పద్దు ప్రవేశపెట్టి ప్రతి కల్లు గీత కార్మికులకు కుటుంబానికి 10లక్షల రూపాయల చొప్పున గీతా బంధు ఇవ్వాలని అన్నారు. కల్లులోని పోషకాలు ఔషధ గుణాలను ప్రభుత్వమే ప్రచారం చేసి కల్లు కు మార్కెట్ సౌకర్యం కల్పించాలన్నారు. సభ్య త్వం కలిగి ఉన్న కార్మికులకు ఉచితంగా బైక్ లు, వడ్డి లేని రుణాలు ఇవ్వాలని తెలిపారు. మెడికల్ బోర్డు నిబంధనలు తొలగించి ప్రమాదవశాత్తు తాడి చెట్టుపై పడి వికలాంగులు అయినచో5 లక్ష లు, చనిపోయిన వారికి 10లక్షలు తక్షణమేఇవ్వా లని వేణు గౌడ్ డిమాండ్ చేశారు.