సి.ఐ రవీందర్, నూతన ఎస్సై ను సన్మానించిన ఇందూరు చంద్రశేఖర్

రుద్రూర్ (జనంసాక్షి): రుద్రూర్ మండల కేంద్రంలో సి.ఐ గా ప్రమోషన్ పొంది బదిలీపై వెళ్తున్న రవీందర్ ను మరియు నూతన ఎస్సై గా బాధ్యతలు స్వీకరించిన నిలేష్ ను సర్పంచ్ ఇందూర్ చంద్రశేఖర్ మర్యాద పూర్వకంగా కలిసి, శాలువా తో సన్మానించారు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పార్వతి ప్రవీణ్ మరియు మండల నాయకులు కర్క అశోక్, మండల కిసాన్ కేత్ అధ్యక్షులు అడపా సాయిలు, కాసుల మహేష్, ఇందూర్ కార్తిక్ తదితరులు పాల్గొన్నారు