సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ
జనంసాక్షి , కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం నాగారం గ్రామానికి చెందిన తాళ్ల లక్ష్మీ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి సిఫారసు చేసుకోగా తాళ్ల లక్ష్మీ కి 14.500 /- రూ, ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు కాగా ఇట్టి సీఎంఆర్ఎఫ్ చెక్కును, మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ , పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ ఆదేశాల మేరకు స్థానిక బీఆర్ఎస్ శ్రేణులు బుధవారం నాగారం గ్రామపంచాయతీ ఆవరణలో ముఖ్యమంత్రి సహాయనిధి లబ్ధిదారుకు చెక్కును అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగారం గ్రామ సర్పంచ్ ఇటవేన కొమురమ్మ, బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ధీకొండ కొమురయ్య, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇటవేన కొమురయ్య, పెండ్లి నారాయణ, నదిగొట్టు సంపత్, బొడ్డుపల్లి సతీశ్, రవి లతో పాటు తదితరులు లతో పాటు తదితరులు పాల్గొన్నారు.