సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేసిన స్థానిక ఉప సర్పంచ్ కొత్తూరు భరత్:
నందిపేట్ (జనం సాక్షి )అక్టోబర్ 20 నందిపేట్ లో ఇంటింటికి వెళ్లి చెక్కులను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఉప సర్పంచ్ మాట్లాడుతూ జీవన్ అన్న ఆదేశాల మేరకు సిఎంఆర్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.. పేదల పెన్నిధి అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే జీవన్ అన్న ఆదేశానుసారం ప్రతి ఇంటింటికి సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని కల్యాణ లక్ష్మి షాది ముబారక్ రైతుబంధు రైతు బీమా దళిత బంధు సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ ఇలా చెప్పుకుంటూ పోతే దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న మన తెలంగాణ రాష్ట్రం అందుతున్న సంక్షేమ ఫలాలు ప్రజలలోకి తీసుకెళ్తూ చైతన్యం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలియజేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రాపల్లి రమేష్, నాయకులు దుబాయ్ శీను ,మహిపాల్, లింగం , గాండ్ల సంతోష్ కాలనీవాసులు పాల్గొనడం జరిగింది