ఆటోలపై ఆర్టీసీ డ్రైవర్ల దౌర్జన్యం

తాడ్వాయి జనంసాక్షి అక్టోబర్ 20
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో ఆర్టీసీ డ్రైవర్లు ఆటో డ్రైవర్ల పై విరుచుకుపడుతున్నారు ఆటోలో ఉన్న ప్రయాణికులను ఆర్టీసీ డ్రైవర్లు ఆటోలను ఆపి మరి ప్రయాణికులను మీరు ఆటోలో ప్రయాణించద్దు అని ఆటో డ్రైవర్లను బెదిరించి ప్రయాణికులను బస్సులో ఎక్కించుకొని వెళ్తున్నారు దీనికి తోడుగా ఆర్టీవోను సంప్రదించి ఆటోలను నడపకుండా చేయడమే  మా ద్వేయం అన్నట్టుగా ఆటోలపై ఆర్టీవోను బలవంతంగా తీసుకువచ్చి అర్హత ఉన్నా కానీ ఏదో రకంగా వీళ్ళ పైన చర్య తీసుకోవాలని ఆర్టీసీ  డ్రైవర్లు ఆదేశానుసారంగా ఆర్టీవో  కూడా వ్యవహరిస్తున్నారు కావున ఆటో డ్రైవర్లు ఈరోజు బ్రహ్మ జివాడి గేట్ దగ్గర మండిపడ్డారు దీనిపైన అధికారులు స్పందించి ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని కోరుతున్నారు
Attachments area