Tuesday, 3 November 2026

సీఎంని ఈగలా వెంటాడుతాం: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీదళిత మోర్చ, గిరిజన మోర్చ రాష్ట్ర కమిటీలు నగరంలోని ఇందిరా పార్కు వద్ద 48గంటల మహాదీక్షకు దిగాయి. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డిమాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు చేసేంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఈగ లా వెంటాడుతామని ఆయన హెచ్చరించారు. వచ్చే శాసన సభ సమావేశాలలో ఎస్సీ, ఎస్టీ సమస్యలపై చర్చించేందుకు వారం రోజులు ప్రత్యేకంగా కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ మైనార్టీ కార్పోరేషన్ల ద్వారా పేదలకు రుణాల్ని అందించాలని అన్నారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి రామ్‌నాథ్‌ గోయల్‌ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌ల తర్వాత దళితులపై అత్యధికంగా దాడులు జరిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే ఎండెల లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌, ఇందిర పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *