సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వీఆర్ఏలు

జనంసాక్షి, కమాన్ పూర్ : వీఆర్ఏ లకు పే స్కేల్ విడుదల చేసి ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించినందుకు గాను పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల తహసిల్దార్ కార్యాలయం ముందు మంగళవారం రెవెన్యూ గ్రామ సహాయకులు ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మండల తహసీల్దార్ దత్తు ప్రసాద్ కి, ఆఫీస్ సిబ్బంది కి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం సంఘము మండల అధ్యక్షులు గరిగంటి కోటేష్, ప్రధాన కార్యదర్శి ఎండి ఆఫ్జల్, ఉపాధ్యక్షులు అనవేన శివ కుమార్, వీఆర్ఏలు రజిత, స్వప్న, వెంకటస్వామి, ప్రేమ్ కుమార్, రాజన్న, నరేష్, రవి, నర్సయ్య, రాధ లు పాల్గొన్నారు.

తాజావార్తలు