Wednesday, 4 November 2026

సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయండి

మద్నూర్ ఏఎంసి చైర్మన్ సాయగౌడ్
జుక్కల్, సెప్టెంబర్ 4,జనంసాక్షి,
నేడు సోమవారం నిజామాబాద్ లోని గిరిరాజ్ కాలేజ్ గ్రౌండ్ లో జరిగే సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయగౌడ్ ప్రజలకు పిలుపునిచ్చారు.
నూతనంగా నిర్మించిన నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ సమీకృత భవనాల సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని ,అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారని ఆయన తెలిపారు.ప్రతి గ్రామం,తాండల నుండి ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలని ఆయన కోరారు. రైతులు, డ్వాక్రా మహిళలు,సర్పంచ్, ఎంపీటీసీ, సింగిల్విండో చైర్మన్ ,టిఆర్ఎస్ నాయకులు ,కార్యకర్తలు అందరు సభకు వచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు.