ముస్తాబాద్ సెస్టంబర్ 16జనం సాక్షి
తెలంగాణ రాష్ట్ర సెక్రెటరీ భవనానికి అంబేద్కర్ గారి పేరు ఖరారు చేయడం సంతోషకరమని గ్రామ సర్పంచి తాడేపు జ్యోతి ఎల్లం, పోతుగల్ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ కొమ్మట రాజలింగం ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రావడానికి కారణం అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ద్వారానే మనం సాధించామని తెలిపారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు




