సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణి.

దౌల్తాబాద్ సెప్టెంబర్ 1, జనం సాక్షి.
మండల పరిధిలోని దొమ్మాట గ్రామానికి చెందిన మహమ్మద్ మూజిబ్ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆస్పత్రిలో కార్పొరేట్ చికిత్స చేయించుకున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రఘునందన్ రావు దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే మహమ్మద్ ముజీబ్ కు ముఖ్యమంత్రి సహాయనిధి దొమ్మాట గ్రామంలో వారి కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును 18000రూ అందజేశారు.ఈ సందర్భంగా బీజేపీనాయకులు ప్రసాద్ రావు, రంజిత్ గౌడ్ లు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు బిజెపి ప్రభుత్వం ఎల్లవేళలా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ గౌడ్, రాజు, స్వామి, ప్రవీణ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.