సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన టి.ఎస్.హెచ్.డి.సి చైర్మెన్ చింతా ప్రభాకర్
సంగారెడ్డి బ్యూరో , జనం సాక్షి , ఆగస్టు 4 ::
సంగారెడ్డి పట్టణంలోని చింతా ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో సంగారెడ్డి మండలం , సంగారెడ్డి పట్టణం,కంది మండలానికి చెందిన 30మంది లబ్ధిదారులకు రూ.1,347,000 /- రూపాయల విలువ చేసే చెక్కుల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిందన్నారు.పేద, మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో సిఎం రిలీఫ్ ఫండ్ వరంలా మారిందనీ గుర్తు చేశారు. సిఎం కెసిఆర్ పేదల ఆరోగ్య పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపుతున్నారని గుర్తు చేశారు.
నియోజకవర్గంలో ఇప్పటికే కోట్లాది రూపాయాలను సిఎం సహాయ నిధి నుంచి అందివ్వడం జరిగిందన్నారు.
ఇకపై కూడా ఎక్కువ మొత్తంలో అందిస్తామని తెలిపారు.