సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం రొంపికుంట గ్రామానికి చెందిన మానుపాటి కార్తీక్ కి మంజూరైన 21,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఆదివారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైనాల రాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. కార్తీక్ అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స చేయించుకొని ఆర్థిక సహాయం కొరకు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మంథని నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ద్వారా సిఫార్సు చేసుకోగా మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు చొరవతో 21,000 రూపాయల చెక్కు మంజూరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కటకం రవీందర్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి భూoపెల్లి రాజయ్య, ఉప సర్పంచ్ గుమ్మడి సతీష్, గ్రామ శాఖ అధ్యక్షులు కోల నరేందర్ , మాజి అధ్యక్షులు గుమ్మడి శ్రీనివాస్ , మాజీ సర్పంచ్ కమ్మగొని మల్లయ్య, కోల నర్సాగౌడ్ వార్డు మెంబర్ సంజీవ్, నరసయ్య, మల్లేష్, సీనియర్ నాయకులు కోల మల్లయ్య గౌడ్ , కటకం లింగయ్య మాజి ఉప సర్పంచ్ కొండి శంకరయ్య, మాజి ఎంపిటిసి కొమురయ్య, గాండ్ల రాజయ్య గుమ్మడి వెంకటేష్, వడ్లకొండ రాజయ్య, దాసరి గట్టయ్య, చోపరి శేకర్, బూసా తిరుపతి, బొజ్జ సతీష్, మామిడి రాజు, యూసుఫ్ లల్లు, పెండ్యాల రాజు, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

తాజావార్తలు