బిజెపి పెద్దపల్లి జిల్లా అధికార ప్రతినిధిగా పోతరవేని క్రాంతి
జనంసాక్షి మంథని : మంథని పట్టణం బోయిన్ పేట కు చెందిన పోతరవేని క్రాంతి కుమార్ ని పెద్దపెల్లి జిల్లా అధికార ప్రతినిధిగా నియమిస్తూ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్ నియామక పత్రాన్ని ఆదివారం అందజేశారు. తన నియామకానికి సహకరించినటువంటి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రాజేందర్ కి రాష్ట్ర ఎన్నకల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ కి, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి కి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ కి, పెద్దపెల్లి జిల్లా ఇంచార్జీ రావుల రామ్ నాథ్ కి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి తదితరులకు క్రాంతి సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ పదవి తో తనపై మరింత బాధ్యత పెరిగిందని, బిజెపిని బలోపేతం చేసి పెద్దపల్లి జిల్లాలో అధికారం తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానని క్రాంతి కుమార్ ఈ సందర్భంగా తెలిపారు.