*గోపాల్ పేట్ జనం సాక్షి ఆగస్టు (28):*
గోపాల్ పేట్ మండల పరిధిలోని పోలికేపాడు , ఆముదాల కుంట తండా గ్రామాలకు చెందిన పలువురికి ఆదివారం సీఎం సహాయ నిధి చెక్కులను మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది చెక్కులు అందుకున్న వారిలో జయమ్మ 20000/- వేల రూపాయలు మొగులాలు 30000/- వేల రూపాయలు జ్యోతి 13000/- వేల రూపాయల చెక్కులను మంత్రి అందించారు బాధితుల విషయమై టిఆర్ఎస్ మండల సోషల్ మీడియా కన్వీనర్ శివకుమార్ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లగా మంత్రి స్పందించి బాధితులకు సీఎం సహాయ నిధి నుడి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో పోలికే పాడు గ్రామ సర్పంచ్ రజిని రాజు, ఆముదాల కుంట తాండ సర్పంచ్ శంకర్ నాయక్ ,మహేష్, శ్రీను, హర్యానాయక్, తదితరులు పాల్గొన్నారు




