సీఎం సభకు భారీగా తరలిన మానాల టీఆర్ఎస్ నాయకులు

రుద్రంగి సెప్టెంబర్ 5 (జనం సాక్షి)
నిజామాబాద్ జిల్లా తెరాస పార్టీ,జిల్లా సమీకృత కార్యాలయ భవన సముదాయాల ప్రారంభోత్సవానికి సోమవారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రారంభోత్సవానికి రావడంతో ఉమ్మడి మానాల నుండి భారీగా తరలిన టీఆర్ఎస్ శ్రేణులు.ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో  నిజామాబాద్ లోని భారీ బహిరంగ సభ నిర్వహించనున్నానేపథ్యంలో.బాల్కొండ నియోజకవర్గం,మానాల టిఆర్ఎస్ పార్టీ నాయకులు మండల అధ్యక్షుడు  దెగవత్ తిరుపతి,వైస్ ఎంపీపీ పిసరి భూమయ్య ల అద్వర్యంలో దాదాపు 200 మంది సీఎం సభకు బయలు దేరారు.. వీరితోపాటు ఉమ్మడి మానాల సర్పంచులు,తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.