సీఎం సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన జడ్పీటీసీ రణం జ్యోతి.
దౌల్తాబాద్ ఆగష్టు 23, జనం సాక్షి.
పేద ప్రజలకు అండగా సీఎం కెసిఆర్ నిలుస్తున్నారని దౌల్తాబాద్ జడ్పీటీసీ రణం జ్యోతి పేర్కొన్నారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్,మంత్రి హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణలో వైద్యానికి పెద్దపీట వేస్తున్నారని,జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ వైద్యం కొనసాగుతుండగా అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు వైద్యం చేయించుకున్న వారికి సైతం సీఎం సహాయనిధి ద్వారా ఆదుకోవడం జరుగుతుందన్నారు.ముఖ్యమంత్రి సహయ నిధి చెక్కులను
గొడుగుపల్లి గ్రామానికీ చెందిన మద్దెల శ్రీకాంత్ 11600, నల్ల అశ్విని 24000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును జెడ్పీటీసీ రణం జ్యోతీ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బాబు, వార్డ్ మెంబర్ నల్ల భూపతి, తెరాస నాయకులు చింటు,రణం హరీష్, అందే మహేష్,దుర్గని నర్సింహులు,
సాయి గౌడ్,తదితరులు పాల్గొన్నారు.