సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

టేకులపల్లి, ఆగస్టు 23( జనం సాక్షి): టేకులపల్లి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బాధితులకు బిఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులనుబుధవారం పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ నిరుపేదలైన టేకులపల్లి కి చెందిన డి దాస్లి కి వైద్య చికిత్స నిమిత్తం 24 వేల రూపాయల చెక్కును అందజేశారు. సులానగర్ గ్రామానికి చెందిన దాస్యం కృష్ణమూర్తికి వైద్య చికిత్స నిమిత్తం 20వేల రూపాయలు చెక్కును బిఆర్ఎస్ నాయకుల చేతులు మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు బొమ్మెర్ల వరప్రసాద్, బోడ బాలు నాయక్ మాట్లాడుతూ
పేద ప్రజలకు సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగకరమైన పేద ప్రజలు వైద్యం కోసం ఖర్చు పెట్టిన డబ్బులను సీఎం సహాయ నిధి ద్వారా 50% నగదును చెక్కుల ద్వారా లబ్ధిదారులకు అందిస్తుందన్నారు. కరోనా కష్ట సమయంలో కూడా పేద ప్రజలకు అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి బిఆర్ఎస్ పార్టీ నాయకులు బర్మావత్ శివకృష్ణ, కాగితాల వెంకటరమణ చారి,కుమ్మరి కిరణ్, లావుడియా నరేష్ నాయక్, కొట్టే సురేష్ తదితరులు పాల్గొన్నారు.