హైదరాబాద్: ఉప్పల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ అమరయ్యకు కర్నూలు జిల్లాకు చెందిన సీబీసీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో కర్నూలు జిల్లా నిమ్మిగనూరు మున్సిపాలిటీలో జరిగిన కుంభకోణంలో ఈయన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 2004 -07 మధ్య కాలంలో ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్‌గా అమరయ్య పనిచేశారు. నిధుల దుర్వినియోగం జరిగినట్లు విచారణలో తేలడంతో ఆయనపై కేసు నమోదు చేయాలని లోకాయుక్త సీఐడీ అధికారులను ఆదేశించింది. ఇందులో ఆయనతోపాటు మరో నలుగురు కమిషనర్లు పాల పంచుకున్నట్లు కేసు నమోదైంది. వీరు మొత్తం రూ. 7.30 కోట్లు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ఉప్పల్ మున్సిపల్ కార్యాలయంలో విచారించిన అనంతరం డిప్యూటీ కమిషనర్‌ను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.




