Thursday, 5 November 2026

సీఐ వెంకటరత్నంకు కళ్లెపు సతీష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు

డోర్నకల్ సెప్టెంబర్ 28 జనం సాక్షి
ఇటీవల డోర్నకల్ పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంకటరత్నంను తెరాస మండల ఉపాధ్యక్షులు కళ్లెపు సతీష్ కుమార్ గౌడ్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.జిల్లా కేంద్రంలో సీఐగా పనిచేసిన అనుభవంతో డోర్నకల్ సీఐగా వెంకటరత్నం రావడం ఇక్కడి ప్రాంత ప్రజల అదృష్టమని సతీష్ కుమార్ గౌడ్ అన్నారు.ఆయన వెంట మాజీ ప్రధానోపాధ్యాయులు కల్లెపు నారాయణ గౌడ్, కల్లెపు అశోక్ గౌడ్,మేకపోతుల శ్రీనివాస్ గౌడ్,
చిలుముల రఘు,కళ్లెపు యాకయ్య,బాణోత్ రాజేష్,భూక్యా శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Attachments area