సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి

*జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్  మధుసూదన్,
ఖానాపురం ఆగష్టు 13జనం సాక్షి
 సీజనల్ వ్యాధుల పట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్
జాతీయ కీటక జనిత వ్యాధులు నివారణ అధికారి డాక్టర్ మధుసూదన్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మరియు బుధరావుపేట సబ్ సెంటర్ ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుధరావుపేటలో మలేరియా పాజిటివ్ కేసులు వస్తున్నందునతీసుకోవలసిన జాగ్రత్తలు
వైద్య సిబ్బంది చేయాల్సిన సేవలు,
ప్రజా ప్రతినిధులు ప్రజలకు యాంటీ లార్వా యాంటీ మస్కిటో , గురించి ప్రతివారం డ్రై డే పాటించాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వాడని టైర్లు ట్యూబులు కొబ్బరి బోండాలు వాడి పడేసిన గ్లాసులు, తోట్లు,గోళాలు, కుండ లు,డ్రమ్ములు ఇతర పాత్రలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని,మెష్ డోర్,దోమతేరలు,వాడాలని,
సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని
 గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు
ప్రజా ప్రతినిధులు కూడా ప్రజలకు విన్నవించాలని కోరారు.
 సెప్టెంబర్ మాసం వరకు ఈ మస్కిటో ఉంటుందని తప్పనిసరిగా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ అరుణ్ కుమార్,
స్థానిక సర్పంచ్ ప్రవీణ్ కుమార్,ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు,అంగన్వాడీ టీచర్స్, సి ఏ లు,
మరియుసబ్ యూనిట్ ఆఫీసర్  నందా,హెల్త్ సూపర్వైజర్ యాకా స్వామి.హెల్త్ అసిస్టెంట్ భాస్కర్, రాంప్రసాద్ రెడ్డి ,జ్యోతి.ఆశాలుజ్యోతి భారతమ్మ లలిత ప్రజా ప్రతినిధులు తదితరులు  పాల్గొన్నారు.

తాజావార్తలు