Tuesday, 3 November 2026

సీతారాముల ఆలయానికి భూమి పూజ..

ఫోటో : భూమి పూజలో పాల్గొన్న స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామస్తులు..
సిద్దిపేట అర్బన్, జూలై 29(జనం సాక్షి): సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి గ్రామంలో సీతారాముల ఆలయానికి శుక్రవారం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామం సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని ఆలయం కోసం అడగగానే కేటాయించిన మంత్రి హరీష్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని గ్రామ సర్పంచ్ రవీందర్ గౌడ్, ఎంపీటీసీ స్రవంతి ప్రశాంత్  తెలిపారు. త్వరలో ఆలయ నిర్మాణాన్ని చేపట్టి త్వరగా తిన పనులను పూర్తి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో శ్రీరామ ఉత్సవ కమిటీ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area