సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గుండా లక్ష్మారెడ్డి మృతి

టేకులపల్లి ,అక్టోబర్ 2( జనం సాక్షి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం లోని సులానగర్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుండా లక్ష్మారెడ్డి(86) అనారోగ్యంతో ఆదివారం సాయంత్రం వారి స్వగృహంలో మృతి చెందారు. ఆది నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే ఎంతో మక్కువ కలిగిన లక్ష్మారెడ్డి టేకులపల్లి మండలంలో కాంగ్రెస్ నాయకులు గోనెల నారాయణ ముఖ్య అనుచరుడుగా కాంగ్రెస్ పార్టీలో ప్రముఖముగా పనిచేశారు. ఆయన మరణ వార్త వినగానే జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, కాంగ్రెస్ నాయకులు భూక్య దల్ సింగ్ నాయక్, లక్కినేని సురేందర్ రావు, ఏలూరి కోటేశ్వరరావు, నర్సింగ్ లక్ష్మయ్య స్థానిక సర్పంచ్ అజ్మీర బుజ్జి శివ నాయక్ వైస్ ఎంపీపీ ఉండేటి ప్రసాద్ ఉప సర్పంచ్ ఉండేటి బసవయ్య తదితరులు భౌతిక ఆయన సందర్శించి వారి కుటుంబాన్ని పరామర్శించారు.