Friday, 6 November 2026

సీనియర్ సిటిజన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక

 అల్వాల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ (ఆస్కా) 14వ వార్షికోత్సవం అల్వాల్ సర్కిల్ ఓల్డ్ అల్వాల్ మంజీరా కాలనీ పార్క్ అసోసియేషన్ భవనంలో అధ్యక్షుడు గురునాథ్ రావు అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తంగెడ క్రిష్ణా రావు,ఉప కులపతి శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాదు హాజరై ప్రసంగించారు. అతిథిగా డాక్టర్ నాగేశ్వరరావు, జిహెచ్ఎంసి ఆసరా ఉపాధ్యాయులు హాజరయ్యారు.సీనియర్లు ఇంకా సంఘ సేవ చెయ్యడం అభినందనలు తెలిపారు. అనంతరం సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా సౌందర్యశ్వర్, ఉపాధ్యక్షులుగా రావిపల్లి రాజసింహారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పాపారావు, ప్రధాన కార్యదర్శి సుదర్శన్ రావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి సూర్య ప్రకాష్, ట్రెజరర్ పద్మ చారి, ఈకార్యక్రమంలో సంఘం నాయకులు పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు.