Tuesday, 3 November 2026

సీపీఐ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి

సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్
ఆకునూరు గ్రామ 6వ మహాసభ జెండావిష్కరణ
చేర్యాల (జనంసాక్షి) జులై 14 : భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ బలోపేతానికి గ్రామ స్థాయిలో పటిష్టతకు కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ సూచించారు. గురువారం మండలంలోని ఆకునూరు గ్రామ శాఖ పార్టీ 6వ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఖచ్చిరు వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. అక్కడి నుండి డబ్బు చప్పులతో శివాలయం హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిపిఐ నాయకుడు పుల్లని వేణు అధ్యక్షతన జరిగిన మహాసభలో వారు మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో పార్టీని పటిష్టతపరిచి బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో కేసీఆర్ ప్రజలను దోచుకుంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారన్నారు. ప్రజల పట్ల కపట నాటకాలు ఆడుతుతున్నారని కేసీఆర్, నరేంద్ర మోడీ దొందు దొందేనని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ పోరాటాలను ఉదృతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిష్టపురం లక్ష్మణ్, సిపిఐ చేర్యాల మండల కార్యదర్శి అందె అశోక్, మండల సహాయ కార్యదర్శి బండారి సిద్ధులు,మండల నాయకులు మేడబోయిన రాములు, బంగారు ప్రేమ్ కుమార్, ఉడుత సత్యనారాయణ, ఎర్ర అశోక్, ఎర్రోళ్ల అఖిల్, సుంచు సంజయ్, కోయినేని యాదయ్య, కోయినేని కనకయ్య, బోడపట్ల శేఖర్, పోషబోయిన పరమ శేఖర్, పోశబోయిన శ్రీకాంత్,ఎర్ర మహేష్, రేసు యాదగిరి,అమరగొండ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
Attachments area