సులానగర్ లో ఘనంగా స్వర్గీయ వైయస్ కి నివాళులు
టేకులపల్లి ,సెప్టెంబర్ 2 (జనం సాక్షి) : టేకులపల్లి మండల పరిధిలోని సులానగర్ గ్రామపంచాయతీలో ఇల్లందు కొత్తగూడెం ప్రధాన రహదారిపై ఉన్న వైఎస్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్సీ సెల్ జిల్లా కాంగ్రెస్ కన్వీనర్ రాస మల్ల నరసయ్య మాట్లాడుతూ స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అన్ని వర్గాల ప్రజలకు చేరువై గుండెల్లో నిలిచారని, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలు నేటికీ మర్చిపోరని అన్నారు. ప్రతి ఇంటికి ఆయన పథకాలు అందాయని ఆయన ఎప్పటికీ చిరస్మరణీయుడని అన్నారు. ఈ కార్యక్రమంలో గుండా రవీందర్ రెడ్డి, సూరేపల్లి ఏడుకొండలు, కొట్టే సురేష్ ,ఈర్ల రమేష్, అజ్మీర రాందాస్ తదితరులు పాల్గొన్నారు.