ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు బండారు నరేందర్
కేసముద్రం ఆగస్టు 30 జనం సాక్షి / మంగళవారం మండల కేంద్రంలో జిల్లా పరిషత్ కేసముద్రం విలేజ్ పాఠశాలలో మండల స్థాయి సైన్స్ సెమినారు నిర్వహించారు.సుస్థిర అభివృద్ధిలో సైన్స్ యొక్క పాత్ర సవాళ్లు,అవకాశాలు అనే అంశంపై నిర్వహించిన ఈ సెమినార్లో మండలంలోని 8,9, 10 తరగతులు చదువుతున్న ప్రభుత్వ ,ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశానికి ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు బండారు నరేందర్ మాట్లాడుతూ… సుస్థిర అభివృద్ధికి సైన్స్ ఎంతో దోహదం చేస్తుందని తెలియజేశారు. సైన్స్ యొక్క అభివృద్ధి ప్రపంచం ఎదుర్కొనే సవాళ్లకు సమాధానం ఇస్తుందని తెలియజేశారు.ఈ సైన్స్ సెమినార్ లో ఎన్నిక కాబడిన ఒక విద్యార్థి జిల్లా స్థాయిలో జరగబోయే సైన్స్ సెమినార్ లో పాల్గొంటారని తెలియజేశారు.మండల స్థాయిలో జరిగినటువంటి ఈ సైన్స్ సెమినార్ లో ప్రధమ బహుమతి వి .జ్యోతిక టి టి డబ్ల్యూ ఆర్ జెసి (కేసముద్రం), ద్వితీయ బహుమతి సిహెచ్ హర్షిని (శ్రీ వివేకవర్ధిని హై స్కూల్) ,తృతీయ బహుమతి జి సాహితి జెడ్ పి హెచ్ ఎస్ (కేసముద్రం స్టేషన్) పొందినారు.ప్రథమ బహుమతి పొందిన విద్యార్థి ఈనెల సెప్టెంబర్ లో జరిగే జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ లో పాల్గొంటారు.ఈ సైన్స్ సెమినార్కు నిర్వాహకులుగా ఉపాధ్యాయులు బి చందర్ , ఎండి హుస్సేన్ లు వ్యవహరించారు.న్యాయ నిర్ణేతలుగా జూనియర్ కళాశాల ఫిజిక్స్ అధ్యాపకులు రాజశేఖర్,కెమిస్ట్రీ అధ్యాపకులు మధు వ్యవహరించారు.సుమారుగా పాఠశాల నుంచి వచ్చిన 20 మంది విద్యార్థులు సైన్స్ సెమినార్లో పాల్గొన్నారు. వివిధ పాఠశాల నుంచి వచ్చిన గైడ్ టీచర్స్ ,ఉపాధ్యాయ, ఉపాధ్యాయిని బృందాలు పాల్గొన్నారు.




