– ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
సూర్యాపేట, డిసెంబర్3(జనంసాక్షి) : సూర్యాపేట జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. చివ్వెంల మండలం గుంపుల దగ్గర కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారులోని నలుగురు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వైద్యం కోసం సవిూపంలోని హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని నిర్ధరించారు. ప్రమాదంతో సూర్యాపేట – ఖమ్మం జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. గత నెలలో దీనికి సవిూపంలోనే ఓ ప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాల విద్యార్థులు విహారయాత్రకు వెళ్లి తిరిగొస్తుండగా ప్రమాదం సంభవించింది. నల్లగొండ జిల్లా పుల్లెల జడ్పీ హైస్కూల్‌కు చెందిన విద్యార్ధులు వంబరు 10న విహారయాత్రలో భాగంగా ద్వారక తిరుమల, అన్నవరం, సింహచలం, వైజాగ్, అరకు తదితర ప్రాంతాల అనంతరం భద్రాచలం వెళ్లారు. అక్కడ నుంచి నవంబరు 11న రాత్రి గంటలకు పుల్లెలకు తిరుగు ప్రయాణమయ్యారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో చివ్వెంల సవిూపంలోకి రాగాను ఎదురుగా వస్తున్న లారీ అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యార్థులతో పాటు పలువురు సిబ్బందికి గాయాలయ్యాయి.




