*సేవాలాల్ సేన మండల అధ్యక్షుడిగా వెంకటేష్ నాయక్*
మునగాల, జూలై 30(జనంసాక్షి): సేవాలాల్ సేన మునగాల అధ్యక్షుడిగా మండలంలోని కృష్ణానగర్ తండాకు చెందిన గుగులోతు వెంకటేష్ నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నట్లు సేవాలాల్ సేన రాష్ట్ర కమిటీ అధ్యక్షులు సభావత్ శ్రీనివాస్ నాయక్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేష్ నాయక్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో నన్ను సేవాలాల్ సేన మునగాల మండలం అధ్యక్షుడిగా నియమించిన సేవాలాల్ సేన అధ్యక్షులు సభవట్ శ్రీనివాస్ నాయక్, ఇంఛార్జి భూక్యా గోపి రాథోడ్ లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గిరిజనుల సమస్యలపై ఎల్లప్పుడూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మండలంలో ఏ తండాలోనైనా సమస్య వచ్చినా ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిస్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగేంద్ర నాయక్, సుమన్ నాయక్ మరియు తదితరులు పాల్గొన్నారు.