” సైకిల్ మోటార్ అదుపు తప్పి వ్యక్తి మృతి”

పెన్ పహాడ్ సెప్టెంబర్ 07 (జనం సాక్షి) : సైకిల్ మోటార్ అదుపు తప్పి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని మాచారం గ్రామ శివారులో చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భావన నాగరాజు హుజూర్ నగర్ పార్థసారథి ట్రాన్స్పోర్ట్  లో లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలో డ్యూటీ దిగి స్పెండర్ ప్లస్ ది చక్ర వాహనం పై గరిడేపల్లి నుండి సూర్యాపేట వెళ్లే ప్రధాన రహదారి లో వేగంగా డ్రైవింగ్ చేస్తూ మాచారం మూలమలుపు వద్ద అదుపు తప్పి గుంతలో పడి తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినాడు భార్య వసంత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ బత్తిని శ్రీకాంత్ గౌడ్ కేసు నమోదు చేసుకుని బాడీ పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్ప చెప్పినారు మృతునికి కుమారుడు కుమార్తె ఉన్నారు