అభినందించిన కమిషనర్ సజ్జన్నార్
హైదరాబాద్,జూన్12(జనం సాక్షి): ఉత్తమ ప్రతిభ కనబర్చిన కోర్ట్ కానిస్టేబుళ్లకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ రివార్డులు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సిబ్బంది క్రమశిక్షణతో పని చేసి నేరస్తులకు కోర్టులో మరిన్ని శిక్షలు పడేలా చేసి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు, తెలంగాణ పోలీసులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో కోర్టు కానిస్టేబుళ్ల సమావేశంలో ఆయన వారికి అభినందనలు తెలిపారు. సైబరాబాద్ కోర్ట్ కానిస్టేబుళ్లు మూడు నెలల వ్యవధిలో 27 గ్రేవ్ కేసులకు సంబంధించి కోర్టులో శిక్షలు పడేలా చేశారు. ఇందులో ముఖ్యమైనవి 7 లైఫ్ కన్విక్షన్లు కాగా, 8 సంవత్సరాలకు పైగా శిక్షలు పడినవి 3 కేసులు ఉన్నాయి. అలాగే 5 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్షలు పడినవి 3 కేసులు ఉన్నాయి.
రివార్డులు అందుకున్న కానిస్టేబుళ్ల వివరాలు
రాజేంద్రనగర్ పిఎస్ కు చెందిన కోర్ట్ కానిస్టేబుల్ రవికుమార్, కూకట్పల్లి పిఎస్ కు చెందిన కోర్ట్ హెచ్సీ రమేశ్ కుమార్, కేపిహెచ్‌బి పిఎస్ కు చెందిన హెచ్సీ భాస్కర్, మాదాపూర్ పిఎస్ కు చెందిన హెచ్సీ ఆంజనేయులు, పిసి మల్లేశ్, ఆర్‌సి పురం పిఎస్ కు చెందిన హెచ్సీ పోచయ్య, పిసి విట్టల్, కొందుర్గు పిఎస్ కు చెందిన పిసి సురేశ్ కుమార్, సనత్నగర్ పిఎస్ కు చెందిన పిసి వెంకటేష్, జీడిమెట్ల పిఎస్ కు చెందిన పిసి రమేశ్, మేడ్చల్ పిఎస్ కు చెందిన పిసి శ్రీనివాస్, శంషాబాద్ పిఎస్ కు చెందిన పిసి క. రవి, షాద్ నగర్ పిఎస్ కు చెందిన పిసి శివరాజన్, కేశంపేట్ పిఎస్ కు చెందిన పిసి వెంకటయ్య, అమన్ గల్ పిఎస్ కు చెందిన పిసి సాయిచరణ్, దుండిగల్ పిఎస్ కు చెందిన పిసి మహేశ్ ఉత్తమ పనితీరును కనబర్చినందుకు సైబరాబాద్ సీపీ చేతుల విూదుగా రివార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ కైమ్స్ర్ జానకీ షర్మిలా, డీసీపీ బాలానగర్ సై శేఖర్, డీసీపీ మాదాపూర్ వేంకటేశ్వర రావు, డీసీపీ శంషాబాద్ పద్మజా, మూడు జోన్ లకు సంబంధించిన ఏసీపీలు, సిసిఆర్‌బి ఇన్ స్పెక్టర్ శ్రీకాంత్, కోర్టు కానిస్టేబుళ్లు, తదితరులు పాల్గొన్నారు.




