సైబర్ నేరాల పట్ల ప్రజలు పూర్తి అవగాహన కలిగి ఉండాలి, ఎస్సై ఉపేందర్
గంగారం ఆగస్టు 30 (జనం సాక్షి)
గంగారం మండలం కేంద్రంలోని కేజీవి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు సైబర్ మోసగాళ్ల బారి నుండి డబ్బులు పోగొట్టుకోకుండా విద్యార్థులకు అవగాహన కల్పించార్ ఆన్ లైన్ ద్వారా లావాదేవీలు నడిపేవారు కొత్త వ్యక్తుల మాటలను నమ్మరాదని, తెలియని మెసేజ్ లపై క్లిక్ చేయరాదని తెలిపారు. సైబర్ నేరగాళ్లు మాయమాటలు చెప్తూ, బహుమతులు వచ్చాయని, లాటరీ తగిలిందని, లోన్లు ఇస్తామని, ఇతరత్రా ఆశ చూపి ఆన్ లైన్ ద్వారా డబ్బులకు ఎర వేస్తారని, అటువంటి వ్యక్తులు పంపే మెసేజ్ లకు స్పందించరాదని ఎస్సై ఉపేందర్ వివరించారు.
ఒకవేళ అనుకోకుండా సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటే, తక్షణమే 155260 లేదా డయల్ 100 నంబర్లకు ఫోన్ చేసి డబ్బులు పోగొట్టుకున్న విషయం ఫిర్యాదు చేయాలని ఎస్సై సూచించారు. తమ అకౌంట్ లో డబ్బులు పోయిన 24 గంటల లోపుగా పై తెలిపిన నంబర్లకు ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న డబ్బులు వెనక్కి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. స్మార్ట్ ఫోన్ వాడే పిల్లల పట్ల తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పిల్లలకు వివరించి తల్లిదండ్రులకు తెలిసేలా మీరు కూడా చెప్పాలని సూచించారు.