సోమశేఖరరెడ్డి ముందస్తు బెయిల్ తీర్పు 9కి వాయిదా
హైదరాబాద్: గాలి జనార్థనరెడ్డి బెయిల్ ముడుపుల కేసులో సోమశేఖరరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పును ఈనెల 9కి వాయిదా వేశారు. గాలి బెయిల్ ముడుపుల కేసులో ఏసీబీ ఎదుట సోమశేఖరరెడ్డి హాజరై నోటీసులకు వివరణ ఇచ్చారు. ఈ కేసులో సోమశేఖర్‌రెడ్డి రెండో నిందితుడు.