సోషల్ మీడియా ప్రచారకర్తగా కాలే అభినయ్
టేకులపల్లి ,సెప్టెంబర్ 28( జనం సాక్షి ): టిఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచార కర్తగా మండలంలోని ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు గ్రామానికి చెందిన కాలే అభినయ్ ను నియమించారు. ఈ మేరకు ఇల్లందు శాసన సభ్యురాలు బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ ఆదేశాల మేరకు బుధవారం ముత్యాలంపాడు క్రాస్ రోడ్ గ్రామపంచాయతీ సర్పంచ్ మాలోత్ సురేందర్ నాయక్ ఆధ్వర్యంలో ముత్యాలంపాడు క్రాస్ రోడ్ గ్రామపంచాయతీ టిఆర్ఎస్ సోషల్ మీడియాగా కాలే అభినయ్ ను నియమిస్తూ ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా అభినయ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతను వమ్ము చేయకుండా నిర్వహిస్తానని తెలుపుతూ ఎల్లందు శాసన సభ్యురాలు హరిప్రియ హరి సింగ్ నాయక్, తనపై అపారమైన నమ్మకంతో ప్రతిపాదించిన సర్పంచ్ సురేందర్ నాయక్ లకు కృతజ్ఞతలు తెలిపారు . అదేవిధంగా స్థానిక టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలకు అభివాదాలు తెలిపారు.