స్థానికంగా ఉండని లైన్ మెన్.
ఇబ్బందుల్లో ప్రజలు.
నెన్నెల, సెప్టెంబర్27,(జనంసాక్షి)
నెన్నెల మండల కేంద్రంలో ఉన్న ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ లైన్ మెన్ స్థానికంగా ఉండక పోవడంతో మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికంగా ఉండి విధులు నిర్వర్తించాల్సిన లైన్ మెన్ పరిసర పట్టణ ప్రాంతం నుంచి రాకపోకలు కొనసాగిస్తుండటంతో, అర్ధరాత్రి కరెంటు పోతే ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. అత్యవసర సర్వీసుల విభాగానికి చెందిన ఉద్యోగులు స్థానికంగా ఉంది విధులు నిర్వహించాల్సి ఉండగా నెన్నెల మండల కేంద్రంలో మాత్రం ఇలాంటివి అమలు జరగడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి లైన్ మెన్ స్థానికంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై ఏఈ మల్లయ్య వివరణ కోరగా లైన్ మెన్ స్థానికంగా ఉండని విషయం నిజమేనని ఇక ముందు స్థానికంగా ఉండి విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చారు.